క్రేజీ బ్యూటీ నయనతార పెళ్లికి రెడీ

SMTV Desk 2019-05-05 17:29:03  nayanatara,

కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సోలో సినిమాలతో కూడా సత్తా చాటుతున్న క్రేజీ బ్యూటీ నయనతార కొన్నాళ్లుగా డైరక్టర్ విఘ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. శింభు, ప్రభుదేవాల తర్వాత విఘ్నేష్ తో ప్రేమలో పడిన నయనతార ఎక్కడికి వెళ్లినా అతన్ని వెంట పెట్టుకుని వెళ్లేది. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న నయనతార ఫైనల్ గా పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యిందట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎంగేజ్మెంట్ చేసుకుని 2020లో మ్యారేజ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట.

తమిళంలో నయన్ కు ఓ స్టార్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఉంటుంది. ఈమధ్య సోలో సినిమాలతో సెన్సేషనల్ హిట్లు కొడుతున్న నయనతార అటు స్టార్ హీరోల సరసన కూడా నటిస్తుంది. ప్రస్తుతం రజినికాంత్ దర్బార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలు కాకుండా సోలో హీరోయిన్ సినిమాలను చేస్తుందని తెలుస్తుంది. మొత్తానికి నయన్ పెళ్లి వార్తల్లో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.