వారెన్‌ బఫెట్‌ వారసుడిగా భారతీయుడు!

SMTV Desk 2019-05-05 17:26:41  Warren Buffett , Berkshire Hathaway, Ajit Jain

హైదరాబాద్‌: బెర్క్‌షైర్‌ హత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ దాదాపు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన వ్యక్తి. ఆయన నిర్వహించే వార్షిక సమావేశం జనంతో కిక్కిరిసిపోతుంది. ఆయన చూపిన బాటలో వెళ్లితే నష్టాలు ఉండవని నమ్మి కోట్లు కుమ్మరించేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు బఫెట్‌ వయస్సు 89 ఏళ్లు. దీంతో సహజంగానే ఆయన వారసుడిగా బెర్క్‌షైర్‌ హత్‌వే పగ్గాలు ఎవరు చేపడతారనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ రేసులో రెండు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. బఫెట్‌ కుమారుడు హోవర్డ్‌ బఫెట్‌ ఛైర్మన్‌ స్థానంలోకి రావడం దాదాపు ఖాయం. ఇక కీలకమైన కంపెనీ సీఈవో పోస్టు కోసమే రేసు. ఈ రేసులో ఒకరు భారతీయుడైన అజిత్‌ జైన్‌ కాగా మరొకరు గ్రెగోరి అబెల్‌ల్లో. ఉన్నారు.