దర్శకుల సంఘానికి మెగాస్టార్ భారీ విరాళం

SMTV Desk 2019-05-05 17:09:47  Chiranjeevi,

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తనను మెగాస్టార్‌ని చేసిన ఇండస్ట్రీ కోసం భారీ విరాళం ప్రకటించారు. స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణ రావు పుట్టిన రోజును ప్రతి ఏటా డైరెక్టర్స్ డేగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే4 అంటే నిన్న దాసరి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం నాడు హైదరాబాద్‌లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘానికి తన వంతు సహాయంగా రూ. 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మెగాస్టార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ఇండస్ట్రీకి చెందిన దాదాపు ౩౦౦ మంది దర్శకులు హాజరయ్యారు.