మాటల తూటాలు పేల్చుకుంటున్న గౌతమ్, అఫ్రిది

SMTV Desk 2019-05-05 17:08:50  shahid afridi, gautam gambhir

ఇస్లామాబాద్: భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ కాప్టెన్ షాహిద్ అఫ్రీది తన ఆటో బయోగ్రఫీని గేమ్ ఛేంజర్ అనే పుస్తకరూపంలో అభిమానులు ముందుకు తీసుకువస్తూ అందులో గంభీర్‌ గురించి ప్రస్తావిస్తూ గంభీర్ కు వ్యక్తిత్వమే లేదని, అతనేదో జేమ్స్ బాండ్.. డాన్ బ్రాడ్‌మన్‌లను దాటేసినట్లుగా ఫీలవుతున్నాడని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గౌతం చాల ఘటగా స్పందించాడు. ఆఫ్రిదిని ఓ సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశాడు. నువ్వో వింత మ‌నిషివి, మేం మెడిక‌ల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీల‌కు వీసాలు జారీ చేస్తున్నాం, దగ్గరుండి నేనే నిన్ను మాన‌సిక వైద్యుడికి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశాడు. ఇక మళ్ళీ దీనిపై స్పందించిన అఫ్రిది గంభీర్‌కు నిజంగా మతిస్తిమితం సరిగా లేదు. అతను మా దేశం వస్తే నా ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చికిత్స చేయిస్తా. ఒకవేళ అతనికి వీసా సమస్య వస్తే. నేను దగ్గరుండి వీసా ఇప్పిస్తా అని అఫ్రిది అన్నాడు.