తెలంగాణ...జిఎస్‌టి వసూల్లో టాప్

SMTV Desk 2019-05-05 17:04:31  telangana, goods and services tax, gst collections

హైదరాబాద్: జిఎస్‌టి వసూల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానాన్ని సంపాదించింది. లక్ష్యానికి మించి మన రాష్ట్రం వసూళ్ళను సాధించి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్ళలో 2018..2019 ఆర్ధిక సంవత్సరంలో పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించి పన్నులు వసూలు కావడంతో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు అయింది. గత ఆర్ధిక సంవత్సరంలో రూ. 44,842 కోట్ల ఆదాయం సాధించాలని లక్షంగా పెట్టుకోగా 2019,మార్చి 31వ తేదీ నాటికి పన్నులు రూ. 45,379 కోట్ల మేరకు సమకూరింది. అంటే లక్ష్యానికి మించి పన్నుల ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 101 శాతం ఆర్ధిక వృద్ధి సాధించినట్లు అయింది. 2017..2018 ఆర్ధిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం రూ. 39,354 కోట్లుతో పోల్చుకుంటే 2018..2-019 సంవత్సరం నాటికి రూ.45,379 కోట్లను సాధించింది. దీంతో 15.5 శాతం అధిక ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు అయింది.