అమెజాన్ సమ్మర్‌సేల్....భారీ డిస్కౌంట్లు

SMTV Desk 2019-05-05 16:39:36  amazon, amazon summer sale

ఈ కామర్స్ దిగ్గజం అమజాన్ మే 4వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకూ సమ్మర్‌సేల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో అనేక వందల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఇక ఎస్‌బీఐ కార్డుపై కొనుగోలు చేసే వారికి 10శాతం రాయితీని అందజేస్తోంది. స్మార్ట్‌ఫోన్ల విషయానికొస్తే, వన్‌ప్లస్ 6T (8+128జీబీ) రూ.32,999కే లభిస్తుండగా, ఐఫోన్‌x రూ.69,999, శాంసంగ్ గెలాక్సీ ఎం20 ప్రారంభ ధర రూ.9,990, రియల్ మి యూ1 రూ.8,999, హానర్ 8ఎక్స్ ప్రారంభ ధర రూ.12,999, వీవో వీ9 ప్రో రూ.15,999, ఒప్పో ఎఫ్11 ప్రో ప్రారంభం ధర రూ.24,990, హు వావే వై9 అతి తక్కువగా రూ.13,999కే లభిస్తున్నాయి. ఇక ప్రత్యేకంగా రెడ్‌మి వై3(32ఎంపీ స్మార్ట్ సెల్ఫీ) 3+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4+64జీబీ వేరియంట్ ధర రూ.11,999 లభిస్తోంది. టీవీలతో పాటు, వివిధ గృహోపకరణాలపై కూడా అమెజాన్ రాయితీ ఇస్తోంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, తదితర ఉత్పత్తులపై 60శాతం డిస్కౌంట్ ప్రకటించింది.