ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని ఎస్‌ జానకి

SMTV Desk 2019-05-05 16:33:04  Singer S Janaki ,

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్. జానకి తుంటి భాగంలో ఎముక విరగడంతో తీవ్రగాయం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మైసూరులో తమ బంధువుల ఇంట్లో బస చేసిన జానకి, ప్రమాదవశాత్తూ కాలు కింద పడటంతో తుంటి భాగానికి బలమైన గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్య పరీక్షలో ఆమె తుంటి భాగంలో కొద్దిగా ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఆమెకు ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. గాయం త్వరగా మానేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిందిగా సిఫార్సు చేయగా, మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం జానకి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు జానకిని పరామర్శించేందుకు ఆసుపత్రికి తరలివస్తున్నారు.