రాజస్తాన్ రాయల్స్ ఔట్!

SMTV Desk 2019-05-05 16:21:43  rr vs dc, ipl 2019

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా శనివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ కాపిటల్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు.. 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తుగా ఓడించేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్ తొలుత స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/17), ఇషాంత్ శర్మ (3/38), ట్రెంట్ బౌల్ట్ (2/27) చెలరేగడంతో.. రాజస్థాన్‌ని 115/9కే పరిమితం చేసిన ఢిల్లీ జట్టు.. అనంతరం రిషబ్ పంత్ (53 నాటౌట్: 38 బంతుల్లో 2x4, 5x6) అజేయ అర్ధశతకం బాదడంతో మరో 23 బంతులు మిగిలి ఉండగానే 121/5తో అలవోక విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకున్న ఢిల్లీ జట్టు 9వ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. లీగ్ దశ ఆఖరి మ్యాచ్ ఆడిన రాజస్థాన్ ఆరో స్థానంతో సరిపెట్టి ఇంటిబాట పట్టింది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు మంగళవారం నుంచి మొదలుకానున్నాయి.