అమెరికా ఎందుకు భయపడుతుంది??

SMTV Desk 2017-08-23 11:42:07  UNO, North korea, USA, Syria, Chemicals, Imports

అమెరికా, ఆగస్ట్ 23: ఉత్తర కొరియాకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమిస్తున్న అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. అయితే అగ్రరాజ్య భయానికి కారణం ఐక్యరాజ్య సమితి విడుదలచేసిన నివేదిక. ఈ నివేదికలో ఉత్తర కొరియా రసాయన ఆయుధాలను తయారు చేస్తుంది అని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇటీవల సిరియా నుండి ఉత్తర కొరియా రెండు పడవల్లో రసాయన దాడులకు అవసరమైన వస్తు పరికరాలను దిగిమతి చేసుకుందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన నివేదికలో తెలిపింది. ఈ దిగుమతులను ఉత్తర కొరియా మైనింగ్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ పేరుతో జరిగినట్లు సమాచారం. అయితే ఈ కార్పొరేషన్ లావాదేవీలను ఐక్యరాజ్యసమితి 2009లోనే నిషేధించింది. రష్యా, అమెరికాలు రసాయన ఆయుధాలు తయారు చేయరాదని ఇదివరకే సిరియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, వాటిని సిరియా లెక్క చేయకుండా ఆయుధాలను తయారు చేసింది. కాగా, వీటిని ఐసిస్ ఉగ్రవాదులపై ప్రయోగించగా, అవి సాధారణ ప్రజలపై ప్రభావం చూపాయి.