అప్పుడే భారత్ మరింత అభివృద్ధి చెందుతుంది

SMTV Desk 2019-05-04 19:02:52  india, Rajnath singh, modi

దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి ప్రధాని మోదీ అని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అన్నారు. లక్నోలో ఎన్నికల ప్రచారంలో రాజ్‌ నాథ్‌ పాల్గొన్నారు. గతంలో ప్రపంచంలో పేద దేశంగా మాత్రమే భారత్‌ కు గుర్తింపు ఉండేదని ఆయన తెలిపారు. పేద దేశం అన్న పేరు నుంచి దేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా ప్రపంచ పటంలో నిలబెట్టిన ఘనత మోదీకే దక్కుతుందని రాజ్‌నాథ్‌ పొగిడారు. మరోసారి మోదీ ప్రధాని అయితే భారత్‌ మరింత అభివృద్ధి చెందుతుందని రాజ్‌ నాథ్‌ ఆకాంక్షించారు.