5జీ స్మార్ట్ టీవీలు

SMTV Desk 2019-05-04 18:52:15  huawei, huawei 5g smart tv

ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ హువావే ఇప్పుడు స్మార్ట్ టీవీ వ్యాపారంలోకి అడుగుపెడుతుంది. కంపెనీ అమ్మకాలు 2019 తొలి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 50 శాతం పెరిగాయి. దీంతో యాపిల్ కంపెనీని వెనక్కు నెట్టి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీగా అవతరించింది.హువావే అదిరిపోయే స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నికాయ్ ఏసియన్ రివ్యూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం హువావే 8కే స్మార్ట్ టీవీ తీసుకురానుంది. అది కూడా 5జీ సపోర్ట్ ఫీచర్‌తో. కంపెనీ తన మేట్ 20ఎక్స్ 5జీ, ఫోల్డబుల్ మేట్ ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ల మాదిరే ఈ టీవీల్లోనూ 5జీ మాడ్యూల్స్‌ను అమర్చనుంది. హువావే కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీల్లో ఒకటి. అలాగే కమ్యూనికేషన్ ఉపకరణాలను కూడా సరఫరా చేస్తూ ఉంటుంది. ఒకవేళ హువావే టీవీ విభాగంలోకి ఎంట్రీ ఇస్తే శాంసంగ్ కంపెనీకి గట్టి పోటీ ఎదురు కానుంది.