నువ్వో వింత మ‌నిషివి...నేనే నిన్ను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్తా: గౌతం

SMTV Desk 2019-05-04 18:43:58  sahid afridi, pakistan cricketer, gautam gambhir

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై పాకిస్తాన్ మాజీ కాప్టెన్ షాహిద్ అఫ్రీది తన ఆటో బయోగ్రఫీని గేమ్ ఛేంజర్ అనే పుస్తకరూపంలో అభిమానులు ముందుకు తీసుకువస్తూ అందులో గంభీర్‌ గురించి ప్రస్తావిస్తూ గంభీర్ కు వ్యక్తిత్వమే లేదని, అతనేదో జేమ్స్ బాండ్.. డాన్ బ్రాడ్‌మన్‌లను దాటేసినట్లుగా ఫీలవుతున్నాడని వ్యాఖ్యానించారు. కొన్ని సంఘటనలు పర్సనల్.. మరి కొన్ని ప్రొఫెషనల్. కానీ, గంభీర్ విషయంలో మాత్రం.. తనకు బీభత్సమైన అటిట్యూడ్. అదే తన సమస్య. ఓ క్యారెక్టర్ అంటూ లేకుండానే అంత పెద్ద క్రికెటర్‌గా స్థానం సంపాదించుకోగలిగాడు. రికార్డులు సాధించాల్సింది పోయి అటిట్యూడ్ తెచ్చిపెట్టుకున్నాడు. అతనేదో డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్ బాండ్‌లను దాటిపోయినట్లు భావిస్తాడు. కరాచీలో ఇలాంటి వాళ్లను వేరే పేరుతో పిలుస్తాం. ఏదైనా అన్నప్పుడు కాంపిటీటివ్‌గా, అగ్రెసివ్‌గా తీసుకోవడమనేది సర్వసాధారణం. వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి. కానీ, గంభీర్ విషయంలో అలా కాదు అని అఫ్రీది విమర్శించాడు. అయితే ఈ వ్యాఖ్యలపై గౌతం చాల ఘటగా స్పందించాడు. ఆఫ్రిదిని ఓ సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ ట్వీట్ చేశాడు. నువ్వో వింత మ‌నిషివి, మేం మెడిక‌ల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీల‌కు వీసాలు జారీ చేస్తున్నాం, దగ్గరుండి నేనే నిన్ను మాన‌సిక వైద్యుడికి ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్తానంటూ గౌతం త‌న ట్వీట్‌ను ఆఫ్రిదికి ట్యాగ్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.