టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని వరుసగా 6 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్

SMTV Desk 2019-05-04 18:43:19  dc vs rr, ipl 2019

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా నేడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ కాపిటల్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్తాన్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించిన కెప్టెన్ అజింక్య రహానె (2: 4 బంతుల్లో) ఫీల్డర్ శిఖర్ ధావన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత మళ్లీ నాలుగో ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన ఇషాంత్.. మరో ఓపెనర్ లివింగ్‌స్టోన్ (14: 13 బంతుల్లో 1x4, 1x6) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం వచ్చిన సంజు శాంసన్ (5: 8 బంతుల్లో) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవగా.. మహిపాల్ లూమర్ (8: 3 బంతుల్లో 2x4) మళ్లీ ఇన్నింగ్స్ 6 ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన ఇషాంత్ శర్మ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి 58 /6 తో ఉంది.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Rishabh Pant(w), Colin Ingram, Sherfane Rutherford, Keemo Paul, Axar Patel, Amit Mishra, Ishant Sharma, Trent Boult.

Rajasthan Royals (Playing XI): Sanju Samson(w), Liam Livingstone, Ajinkya Rahane(c), Riyan Parag, Stuart Binny, Mahipal Lomror, Krishnappa Gowtham, Shreyas Gopal, Ish Sodhi, Varun Aaron, Oshane Thomas.