నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా

SMTV Desk 2019-05-04 18:39:17  Rakul Preet Singh, Ajay Devgn

టాలీవుడ్‌ లో నటిగా తన కంటూ స్పెషల్ పేరు తెచ్చుకున్న రకుల్ ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇప్పుడు బాలీవుడ్‌లో చక్రం తిప్పాలని చూస్తోంది. అజయ్‌ దేవగణ్‌ సరసన ఆమె నటించిన సినిమా ‘దే దే ప్యార్‌ దే’. అకీవ్‌ అలీ దర్శకత్వం వహించన ఈ సినిమా మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో 26 ఏళ్ల రకుల్‌ 50 ఏళ్ల అజయ్‌ ప్రేయసిగా నటించారు. ఆయన మాజీ భార్య పాత్రను టబు పోషించారు. ఈ నేపథ్యంలో నిజ జీవితంలో మీ కన్నా వయసు బాగా ఎక్కువ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారా?’ అని రకుల్‌ను ప్రశ్నిస్తే నిజ జీవితంలో నేను ప్రేమలో పడేందుకు ఎదురుచూస్తున్నా. ఆ వ్యక్తి వృద్ధుడా? లేదా యువకుడా?అనేది అనవసరం అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం రకుల్ టాలీవుడ్ లో నాగార్జున మన్మధుడు 2 సినిమాలోనూ అలాగే, తమిళంలో ఎన్జీకే సినిమాలోనూ చేస్తోంది.