మళ్ళీ రహనేకే!

SMTV Desk 2019-05-04 18:37:54  ipl 2019, rajasthan royals, rr, rahane, steave smith

రాజస్థాన్: రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడుతున్న రహనేను మొదట కెప్టెన్ గా నియమించిన యాజమాన్యం వరుస ఓటముల కారణంగా అతన్ని కేప్టన్సి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. రహనేను కేప్టేన్సి నుంచి తప్పించి ఆ జట్టు కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించింది యాజమాన్యం. అయితే ప్రపంచకప్ నేపథ్యంలో స్టీవ్‌స్మిత్ (ఆస్ట్రేలియా) స్వదేశానికి వెళ్లిపోవడంతో మళ్లీ రహానెని కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్లో 13 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ జట్టు ఐదు విజయాలు సాధించి, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో 11 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన జోస్ బట్లర్, జోప్రా ఆర్చర్, బెన్‌స్టోక్స్, స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం జట్టుని వీడటంతో ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి పోటీనివ్వడం కష్టమైన పనే.