‘అర్జున్ రెడ్డి’పై మహిళా సంఘాల విమర్శలు

SMTV Desk 2017-08-22 18:45:22  arjun reddy, congress leader V.Hanumanth rao, vijay, sandeep reddy vanga, pranai reddy vanga, shalini, mahila sangalu

హైదరాబాద్, ఆగస్ట్ 22 : పెళ్ళిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇటీవల ‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్ పై సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు (వీ హెచ్) మండిపడ్డ విషయం తెలిసిందే. ఆయన తీరు పట్ల హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్స్ పట్ల తాజాగా మహిళా సంఘాలు కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో పోలీసులు స్పందిస్తూ ..ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగా ను స్టేషన్ కు పిలిపించినట్లుగా సమాచారం.