పార్టీ మారిన ఎమ్మెల్యే పై వ్యతిరేక నినాదాలు ?

SMTV Desk 2019-05-04 17:05:36  Hari priya, TRS leader

ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రల గ్రామంలో ఈ ఉదయం ఎమ్మెల్యే హరిప్రియ జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. ఇటీవల టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు . దీనిపై సీరియస్ గా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు.. ఆమె ప్రచారాన్ని అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హరిప్రియ పార్టీ మారడంపై అసహనంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు… ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ హెచ్చరించారు. అక్కడ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపైకి మరొకరు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు కూడా కొద్దిసేపు ఏం చేయలేకపోయారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో… పోలీసులు భారీగా చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు పంపించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు.