పంజాబ్: ప్లేఆఫ్స్ కి కష్టమే

SMTV Desk 2019-05-04 17:01:49  kxip, ipl 2019, kxip vs kkr, ravichandran ashwin

మొహాలి: శుక్రవారం రాత్రి మొహాలీ వేదికగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెల్సిందే. ఈ ఓటమితో పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. ఐపిఎల్‌-12లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు కథ దాదాపు ముగిసినట్లే. ప్లేఆఫ్స్‌కు ముందు ఇంకో మ్యాచ్‌ ఉన్నప్పటికీ ఆ మ్యాచ్‌ తర్వాత పంజాబ్‌ ముందుకు వెళ్లే అవకాశాలు తక్కువ. ఓటమిపై ఆ జట్టు కెప్టెన్‌ అశ్విన్‌ మాట్లాడుతూ..దాదాపు లక్ష్యాన్ని గతంలో చేరుకోగలిగామని, కాని ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో మంచు కీలక పాత్ర పోషించిందని అన్నారు. అది ప్రత్యర్ధికి కలిసొచ్చింది. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ కూడా బాగా ఆడారు. చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. రెండు జట్ల మధ్య పవర్‌ప్లేనే తేడా ఉందని అశ్విన్‌ పేర్కొన్నాడు.