సూపర్ ఓవర్లో రోహిత్ ఆడలేడా!

SMTV Desk 2019-05-04 12:36:51  ipl 2019, mi vs srh, rohit sharma

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌..ముంభై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంభై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు.. ఓపెనర్ డికాక్ (69 నాటౌట్: 58 బంతుల్లో 6x4, 2x6) అర్ధశతకం బాదడంతో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో మనీశ్ పాండే (71 నాటౌట్: 47 బంతుల్లో 8x4, 2x6) కీలక ఇన్నింగ్స్‌కు తోడు నబీ( 20 బంతుల్లో 31) ఆడటంతో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి సరిగ్గా 162 పరుగులే చేసింది. అయితే సూపర్ ఓవర్‌లో తడబడి ముంబైకి మ్యాచ్‌ను కోల్పోయింది హైదరాబాద్. అయితే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లగా మరో హిట్టర్‌తో కలిసి ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వస్తాడని అభిమానులు భావించినా నిరాశే ఎదురైంది. కొందరు నెటిజన్లు హిట్ మ్యాన్ రోహిత్‌పై జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్స్ హిట్ మ్యాన్‌గా పిలుచుకునే వ్యక్తి సూపర్ ఓవర్ కూడా ఆడలేడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యుద్ధంలో రాజులెప్పుడూ ముందుగా రంగంలోకి దిగరంటూ రోహిత్ ఫ్యాన్స్ అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అంపైర్లతో రోహిత్ శర్మ చర్చిస్తుండగా తీసిన ఫొటోపై కూడా సెటైర్లు వేశారు. ప్లే ఆఫ్స్ కు వెళ్లిన ముంబై ఇండియన్స్ సంబరాలు అని కామెంట్లతో ఆడుకున్నారు.