ఐరోపాలో కీర్తి సురేష్ అవుట్ డోర్ షూటింగ్

SMTV Desk 2019-05-03 16:47:00  keerthy suresh, mahanati, tamil actress, agnyatavasi

నయనతార .. అనుష్క .. త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ తొలినాళ్లలో గ్లామరస్ పాత్రలకి ప్రాధాన్యతనిచ్చారు. తమ అందచందాలతో యూత్ హృదయాలను కొల్లగొట్టేశారు. ఒక దశాబ్ద కాలం తరువాత నాయికా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం మొదలుపెట్టారు. అలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోను తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

కానీ కీర్తి సురేశ్ మాత్రం కెరియర్ తొలినాళ్లలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ ఉండటం విశేషం. మహానటి తో మంచి మార్కులు కొట్టేసిన ఆమె, ప్రస్తుతం నరేంద్రనాథ్ అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తోంది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగును, ఐరోపాలో ప్లాన్ చేశారు. ఈ నెల తరువాత ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లనుంది. 45 రోజుల పాటు ఏకధాటిగా అక్కడ షూటింగు జరుపుతారట. ఒక కొత్త దర్శకుడితో చేయడానికి కీర్తి సురేశ్ ఒప్పుకోవడం విశేషమని చెప్పుకుంటున్నారు.