ఈదురుగాలులు, తీవ్ర పెనుతుఫాను నడుమ ఆడశిశువు జననం...పేరు వింటే ఆశ్చర్యపోతారు

SMTV Desk 2019-05-03 16:03:39  baby fani, fani cyclone, tufan, odisha, bhubaneshwar

తీవ్ర పెనుతుఫాను ఫణి ఈ ఉదయం ఒడిశాలో తీరం దాటిన సంగతి తెలిసిందే. తీరం దాటిన తర్వాత కూడా ఫణి పూరీ, భువనేశ్వర్ ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.03 నిమిషాలకు భువనేశ్వర్ లోని రైల్వే ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది.

ఓవైపు అతి భారీవర్షాలు, మరోవైపు ఈడ్చికొడుతున్న గాలులతో ఫణి తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న సమయంలోనే ఆ పాప జన్మించింది. ఈ నేపథ్యంలో, ఆ పసికందుకు కుటుంబ సభ్యులు ఫణి అని తుపాను పేరు పెట్టుకుని మురిసిపోయారు. ఆ బిడ్డకు జన్మనిచ్చిన యువతి మంచేశ్వర్ లోని రైల్వే కోచ్ రిపేర్ యూనిట్ లో హెల్పర్ గా పనిచేస్తోంది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.