కోట్లు విలువచేసే విల్లాలో..... ఆటో డ్రైవర్ విలాసవంతమైన జీవితం

SMTV Desk 2019-05-03 15:58:01  auto driver, bangalore, subramani, foreigner

సాధారణంగా ఆటో డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది..? మహా అంటే.. మధ్యతరగతి జీవితాన్ని గడపగలరు. కానీ ఓ ఆటో డ్రైవర్ మాత్రం విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. కోట్లు విలువచేసే విల్లాలో అతను నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు అతని ఇంటి వివరాలపై ఆరా తీయగా... నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లో ఆటోడ్రైవరు సుబ్రమణి నివాసముంటున్న విలాసవంత విల్లాపై ఐటీ అధికారుల దాడిలో వాస్తవాలు బయటపడుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....ఒక విదేశీ మహిళ డబ్బుతో ఆటోడ్రైవరు బంగ్లా కొనుగోలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆటోడ్రైవరు సుబ్రమణి ఇంటిపై దాడిచేసిన ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వాటిని పరిశీలించగా సుబ్రమణి ఒక విదేశీ మహిళకు బినామీ అని తెలిసింది. సుబ్రమణికి అనుకోకుండా ఓ విదేశీ మహిళ పరిచయం అయ్యింది. ఆమె భారతదేశంలో ఆస్తులు కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు సబ్రమణికి తెలిపింది. దీంతో.. అతను ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె చేత భవనం కొనిపించి.. తన పేరిట రాయించుకున్నాడని అధికారుల దర్యాప్తులో తేలింది.