మహేష్ - అనిల్ రావిపూడి సినిమాలో వీరే హైలైట్

SMTV Desk 2019-05-03 14:13:25  f2, mahesh 26, anil ravipudi next

ఓ పక్క ఇలా మహేశ్ బాబు 25వ సినిమా పూర్తి అయిందో లేదో ఇంకో పక్క 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం విజయశాంతిని .. మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నట్టుగా ఫిలిం నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

దాంతో విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది? రమ్యకృష్ణ పాత్ర ఏమిటి? అనే ఆత్రుత అందరిలోను మొదలైంది.

ఈ సినిమాలో మహేశ్ బాబుకి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుందనీ .. అత్త పాత్రను విజయశాంతి పోషించనుందనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. అందువల్లనే ఇంతటి క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్స్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.