ఉద్యోగులకు ఎయిర్ ఇండియా స్ట్రాంగ్ వార్నింగ్

SMTV Desk 2019-05-03 14:12:40  air india, air india mployees, jet airways

యూనిఫామ్ ధరించి సంస్థకు వ్యతిరేకంగా మీడియాతో పలువురు ఉద్యోగులు మాట్లాడిన సందర్భాలను గమనించామని, ఇకపై ఇలాంటి వాటికి ముగింపు పలకాలని హెచ్చరించింది. ఎవరూ కూడా మీడియాతో మాట్లాడవద్దని తన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా యాజమాన్యం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

యూనిఫామ్ వేసుకుని మీడియాతో మాట్లాడిన సన్నివేశాలు వివిధ ఛానళ్లలో ప్రసారమయ్యాయని, సోషల్ మీడియాలో కూడా కంపెనీ గురించి చెడుగా మాట్లాడిన వీడియోలను పెడుతున్నారని ఎయిర్ ఇండియా డైరెక్టర్ అమృత శరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థకు చెడ్డ పేరును తీసుకొచ్చే ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ఉద్యోగులను మరోసారి కోరుతున్నానని చెప్పారు. యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకోకుండా ఏ ఒక్క వ్యక్తి కానీ, వ్యక్తుల సమూహం కానీ, ఉద్యోగుల యూనియన్ కానీ మీడియాతో మాట్లాడకూడదని గట్టిగా హెచ్చరించారు.