వరల్డ్ కప్ మనకే: సచిన్

SMTV Desk 2019-05-03 13:19:32  icc world cup 2019, sachin tendulkar, teamindia

న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన టెండూల్కర్ ఐసిసి వరల్డ్ కప్ పై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముంబయిలోని ఎంఐజీ మైదానంలో సచిన్‌ పేరతో పెవిలియన్‌ ఎండ్‌ను ప్రారంభిచిన సచిన్ మాట్లాడుతూ...ఈసారి ప్రపంచకప్‌ భారత్‌కే రాబోతుందని జోస్యం చెప్పాడు. ఎండల ప్రభావానికి పిచ్‌లు ప్లాట్‌గా మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పిచ్‌పై బ్యాట్స్‌మెన్‌ సౌకర్యంగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పైగా ఇంగ్లాండ్‌లో ఉండే పిచ్‌లన్నీ ఫ్లాట్‌గా ఉంటాయి. కాబట్టి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే, ఇంగ్లాండ్‌ వాతావరణంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌పై ప్రభావం ఉండదు. ఇక బ్యాటింగ్‌ విషయంలో భారత బ్యాట్స్‌మెన్‌ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌పాండ్యతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా మంచి లయతో ఆడుతున్నారు. వీళ్లంతా ఐపీఎల్‌లో బాగా రాణిస్తున్నారు. ఒక క్రికెటర్‌ ఏ ఫార్మాట్‌లో రాణించినా అతనిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఈసారి ప్రపంచకప్‌లో భారత్‌ ఫేవరెట్‌ జట్టు అనడంలో సందేహం లేదుగ అని సచిన్‌ పేర్కొన్నాడు.