ఏప్రిల్‌లో భారీగా క్షీణించిన అమ్మకాలు

SMTV Desk 2019-05-03 13:17:11  mahindra and mahindra, tata motors, hero

ముంబై: ఏప్రిల్ నెలలో ప్రముఖ కంపనీల వాహనాల అమ్మకాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హీరో మోటో కంపెనీల వాహనాల అమ్మకాలు చాలా ఎక్కువగా క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు ఏప్రిల్ లో 9.1 శాతం తగ్గాయి. గతేడాదిలో 48,097 యూనిట్లు విక్రయించగా, ఈసారి 43,721 యూనిట్ల సేల్స్ మాత్రమే జరిగాయి. ఈమేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. టాటా మోటార్స్ సేల్స్ కూడా ఏప్రిల్ లో 20 శాతం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో 42,577 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదైనట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో సేల్స్ 53,511 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన సేల్స్ 36,276 యూనిట్ల నుంచి 29,883 యూనిట్లతో 18 శాతం డౌన్ అయ్యాయని ముంబైకి చెందిన కారు, ట్రక్ తయారీ సంస్థ టాటా మోటార్స్ వెల్లడించింది. ఇక దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటో సేల్స్ ఏప్రిల్‌లో 17.24 శాతం క్షీణించాయి. గత నెలలో అమ్మకాలు 5,74,366 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 6,94,022 యూనిట్లతో పోలిస్తే తగ్గాయి. మార్కెట్ పరిస్థితులు సవాల్ మారడంతో 201819లో కంపెనీ సేల్స్ 7.8 మిలియన్ యూనిట్లు నమోదయ్యాయి.