ఫారెన్ లుక్‌లో మారుతి సుజుకి 'స్విఫ్ట్' స్పోర్ట్ కారు

SMTV Desk 2019-05-03 13:13:03  maruti, maruti suzuki, maruti suziki swift sports

న్యూఢిల్లీ: ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల విభాగంలో అనేక కొత్త కొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. వాటిలో దాదాపు అన్నీ మోడళ్లు సక్సె్స్ అయ్యాయి. సక్సెస్ అయిన వాటిలో స్విఫ్ట్ కూడా ఒకటి. సుజుకీ స్విఫ్ట్ కారులో స్పోర్ట్స్ మోడల్ ఒకటి దర్శనమిచ్చింది. కంపెనీ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2019లో ఈ కారును ప్రదర్శనకు ఉంచింది00. ఇది కస్టమ్ కారు. మీరు ఈ కారును ఇంత వరకు మారెక్కడా చూసి ఉండరు. సుజుకీ స్విఫ్ట్ స్పోర్ట్ కారు అదిరిపోయే లుక్‌తో ఉంది. యెల్లో కలర్‌లో కార్ల ప్రియులను కట్టిపడేస్తోంది. పెద్ద టైర్లు మరో ఆకర్షణ. హెడ్‌లైట్స్ కారు అందాన్ని మరింత పెంచాయని చెప్పుకోవచ్చు. వెనకు భాగంలో టెయిల్ లైట్స్ కూడా భిన్నంగా ఉన్నాయి. అలాగే డ్యూయెల్ ఎక్స్‌హాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కారు పైభాగం కూడా పసుపు రంగులోనే ఉండటం గమనార్హం. కారు ఇంటీరియర్ రెగ్యులర్ స్విఫ్ట్ కారు మాదిరే ఉంది. కారులో 1.4 లీటర్ 4 సిలిండర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 140 హెచ్‌పీ@5500 ఆర్‌పీఎం. మార్జిమమ్ టార్క్ 230 ఎన్ఎం@3500 ఆర్‌పీఎం. కారులో ఆరు గేర్లు ఉంటాయి.