బీఎస్ఎన్ఎల్ బిగ్ ఆఫర్...రోజుకు 3.21 జీబీ డేటా

SMTV Desk 2019-05-03 12:26:43  bsnl, bsnl prepaid offers

ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీనిస్తుంది. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ లేదా అదనపు డేటా ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తున్న విషయం తెలిసిందే. బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ వాలిడిటీ సాధారణంగా ఏప్రిల్ చివరికల్లా ముగియాల్సి ఉంది. అయితే కంపెనీ అదనపు డేటా గడువును జూన్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించింది. అదనపు డేటా ఆఫర్‌లో భాగంగా ప్రిపెయిడ్ మొబైల్ యూజర్లు రోజుకు 2.21 జీబీ అదనపు డేటాను పొందొచ్చు.రూ.186 ప్రిపెయిడ్ ప్లాన్‌పై రోజుకు 1 జీబీ కాకుండా ఇకపై 3.21 జీబీ డేటా పొందొచ్చు. రూ.429 ప్లాన్‌పై కూడా ఇదే డేటా లభిస్తుంది. రూ.485, రూ.666 వంటి రోజుకు 1.5 జీబీ డేటా అందించే ప్లాన్లపై ఇకపై 3.71 జీబీ డేటా పొందొచ్చు. రూ.1,699 ప్లాన్‌పై రోజుకు 2 జీబీ కాకుండా 4.21 జీబీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే రూ.187, రూ.349, రూ.399, రూ.447 వంటి ప్రిపెయిడ్ ఎస్‌టీవీ రీచార్జ్‌లపై కూడా అదనపు డేటా ప్రయోజనాలు అందుతున్నాయి. వీటిపై కూడా రోజుకు 3.21 జీబీ డేటా పొందొచ్చు.