విశాఖలో ఐపీఎల్....టికెట్స్ అమ్మకాలు షురూ!

SMTV Desk 2019-05-03 11:55:42  ipl 2019, ipl 2019 play off match tickets in vizag

విశాఖపట్టణం: దాదాపు మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ విశాఖలో ఐపీఎల్ సందడి రాబోతుంది. 2016 లో చివరి సరిగా విశాఖలో ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈ నెల మే 8న ఎలిమినేటర్ మ్యాచ్, మే 10న క్వాలిఫయర్ మ్యాచ్ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు సంబందించిన టికెట్లు ఈరోజు నుంచి అమ్మనున్నారు. రూ.500, రూ.1000, రూ.1500, రూ.1750, రూ.3500, రూ.7500 టికెట్లతోపాటు కార్పొరేట్‌ బాక్సుకు సంబంధించి రూ.9000, రూ.5000 ధరల్లో టికెట్లను ఆన్‌లైన్‌ లో అమ్ముతారు. ఆయా ఫ్రాంఛైజీలు, ఈవెంట్స్‌ నౌ వెబ్‌సైట్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.