రజినీకాంత్ - మురుగదాస్ చిత్ర బృందం పై రాళ్ల దాడి

SMTV Desk 2019-05-03 11:28:42  rajinikanth, thalaiva, south indian star, super star rajinikanth

చెన్నై, మే ౦౩: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగా ఓ కాలేజీలో సీన్లు తీస్తుండటంతో, విద్యార్థులు వారిపై రాళ్ల దాడికి దిగారు.

సినిమా షూటింగ్ ను చూసేందుకు వచ్చిన విద్యార్థులు, తమ సెల్ ఫోన్లలో అక్కడి దృశ్యాలను తీస్తుండటంతో, యూనిట్ సభ్యులు వారిని అడ్డుకున్న వేళ, తొలుత వాగ్వాదం, ఆపై రాళ్లదాడి జరిగాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన మురుగదాస్, తన సినిమా ఫొటోలు లీక్ కావడంతో తీవ్ర అసంతృప్తికి లోనై, వెంటనే లొకేషన్ మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.