జనసేన కి బిగ్ షాక్ ..

SMTV Desk 2019-05-03 10:14:52  Janasena, Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఇంకా రానేలేదు. అప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య, అర్జున్ చింతపల్లి‌లు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి వారు మెగా ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నారు. తమ వ్యక్తిగత కారణాల వల్లే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వారు పవన్ కళ్యాణ్‌కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అయితే ఆయనకు టీడీపీతో జనసేన అంతర్గత ఒప్పందం నచ్చకపోవడం వల్లే రాజీనామా చేశారని సమాచారం సమాచారం పార్టీని నమ్ముకుని వున్న సీనియర్ నేతలను పట్టించుకోకుండా కొత్తవారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా వారి రాజీనామాకు కారణం అని తెలుస్తుంది . మారిశెట్టి రాఘవయ్య జనసేనలో కోశాధికారిగా ఉన్నారు. మరో నేత అద్దేపల్లి శ్రీధర్ కూడా కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంలేదు