రావణ లంకలో సాధ్యమైనప్పుడు...రాముడి అయోధ్యలో ఎందుకు కాదు?

SMTV Desk 2019-05-02 19:27:45  mes, muslim schools, muslim colleges, calicut, ayodya

తిరువనంతపురం, మే 02: కేరళలో ముస్లిం కాలేజీల్లో,స్కూళ్లలో బుర్ఖా ధరించడంపై ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ(MES) నిషేధం విధించింది. ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ...తమ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీల్లో మహిళలు బర్ఖా ధరించడంపై నిషేధం విధిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.

రిపోర్టుల ప్రకారం...MESకి చెందిన విద్యాసంస్థలు ముస్లిం జనాభా శాతం ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాలో ఉన్నాయి. బుర్ఖాపై నిషేధం విధిస్తూ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ ఏప్రిల్-17, 2019న కాలికట్ లో ఆర్డర్ పాస్ చేసింది. అయితే ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ నిర్ణయాన్నిముస్లిం సంఘాలు తప్పుబడుతున్నాయి. మతాచారాలకు, కమ్యూనిటి మనోభావాలకు వ్యతిరేకంగా MES నిర్ణయం తీసుకుందంటూ ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వరుస బాంబు పేలుళ్లలో 250 మందికి పైగా చనిపోయిన తర్వాత శ్రీలంక అన్ని రకాల బుర్ఖాలు, మాస్క్ లు ధరించడంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా శ్రీలంక నిర్ణయాన్ని భారత్ లో కూడా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

జాతీయ భద్రత దృష్యా శ్రీలంక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఇది రావణ లంకలో సాధ్యమైనప్పుడు...రాముడి అయోధ్యలో ఇది ఎప్పుడు జరుగుతందని, శ్రీలంక అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ లోని ప్రధాని మోడీ సర్కార్ కూడా ఫాలో కావాలని కోరుతూ శివసేన బుధవారం తమ పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది.

అంతే కాకుండా.....న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలు ఇప్పటికే బుర్ఖా ధరించడంపై నిషేధం విధించిన విషయాన్ని ఆ కథనంలో శివసేన ప్రస్తావించింది.