వాట్సాప్‌లో బ్లాక్ చేసిందని చంపేశాడు!

SMTV Desk 2019-05-02 17:34:03  uae, a guy killed his girlfriend while she blocked him in her whatsapp

యూఏఈ: యూఏఈకి చెందిన ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ అతన్ని వాట్సాప్‌లో బ్లాక్ చేసింది అని తన గొంతు నలిపి చంపేశాడు. వీరు చాలాకాలం నుండి ప్రేమించుకుంటూ తిరుగుతున్నారు. ఇక చాల్లే ఎన్నాళ్లిలా ప్రేమికుల్లా.. పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. దానికి ఆమె ముందు ఒప్పుకున్నా ఆ తరువాత ముఖం చాటేసింది. అలాగే ఫోన్ కాల్ లేదు.. ఓ మెసేజ్ లేదు వాట్సాప్‌లో కూడా బ్లాక్ చేసింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌కి బీపీ పెరిగింది. అసలేంటి నీ వ్యవహారం. ఎందుకిలా చేస్తున్నావు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా అని ఆమెను నిలదీశాడు. వారిద్దరి మధ్యా ఈ విషయమై చాలాసేపు గొడవ జరిగింది. ఆమెపై అతడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె గొంతును గట్టిగా పట్టుకుని ఊపిరాడకుండా చేశాడు. టవల్‌తో ముఖాన్ని కప్పేసి అతి కిరాతకంగా హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. హత్యానేరం అతడి మీదకు వస్తుందని భావించి దేశం విడిచి పారిపోవాలని ప్లాన్ వేశాడు. కానీ యువతి పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు. యువతిని హత్య చేసినందుకు పదేళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. శిక్షపూర్తయిన అనంతరం దేశం నుంచి బహిష్కరించనున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.