ఇప్పటివరకు జిఎస్టీ వసూళ్లు!!

SMTV Desk 2017-08-22 14:21:42  GST(GOODS SERVICE TAX), 42,000 ADDITIONAL INCOME,

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22 : జూలై ఒకటవ తేదీన అమలులోకి వచ్చిన జిఎస్టీ(వస్తు సేవల పన్ను) ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో వసూళ్లను తెచ్చిపెట్టింది. మొదటి నెల ఆదాయం ఇప్పటి వరకు రూ.42,000 కోట్లు వచ్చి చేరింది. జూలై రిటర్న్‌ల దాఖలు, పన్నుల చెల్లింపునకు గడువు ఈ నెల 25 దాకా పొడిగించడంతో రాబడులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిఎస్టీలో రూ.15,000 కోట్లు అంతర్రాష్ట్ర సరుకుల బదిలీకి సంబంధించి వసూలు కాగా, కార్లు, పోగాకుపై విధించిన సెస్ రూపంలో మరో రూ.5000 కోట్లు వసులై౦దని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 22,000 కోట్లు కేంద్ర, రాష్ట్ర జిఎస్టీ ద్వారా వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 10 లక్షల మంది పన్ను చెల్లింపు దారులు రిటర్న్‌లు దాఖలు చేశారు. మరో ఇరవై లక్షల మంది వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వడంతో రిటర్న్ ఫామ్స్ పొందుపరిచారని వెల్లడించారు.