ప్రపంచ నెంబర్‌ వన్‌ స్థానంలో అపూర్వి చండేలా

SMTV Desk 2019-05-02 16:12:57  apoorvi chandela, indian shooter, wolrd shooting rankings 2019

న్యూఢిల్లీ: ప్రపంచ షూటింగ్‌ ర్యాంకింగ్స్‌లో భారత షూటర్‌ అపూర్వి చండేలా(26) సత్తా చూపింది. షూటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈమె అగ్రస్థానాన్ని సొంతం చేసుకొని ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ రెండో ర్యాంకును దక్కించుకుంది. అపూర్వి ఇప్పటికి 2020 టోక్యో ఒలంపిక్స్‌ కోటా స్థానాన్ని సాధించింది. గత ఫిబ్రవరిలో జరిగిన వరల్డ్‌కప్‌లో స్వర్ణ పతకం గెలిచింది.