తల్లి చెంతకే బిడ్డ...సింధు శర్మ కేసులో హైకోర్టు తీర్పు

SMTV Desk 2019-05-02 15:42:29  sindhu sharma, high court

హైదరాబాద్‌: జస్టిస్‌ నూతిరామ్మోహన్‌ రావు కోడలు సింధు శర్మ అతని పెద్ద కూతురి కోసం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు తెలంగాణ హైకోర్టు పిటిషన్‌పై కొన్ని షరతులతో కూడిన కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా వారంలో రెండు రోజుల పాటు తండి వద్ద బిడ్డను ఉంచాలంది. కుమార్తెతో సహా భార్యాభర్తలిద్దరూ ఈరోజు కోర్టుకు హాజరయ్యారు. దాదాపు గంటపాటు వాదనలు విన్న ధర్మాసనం..బిడ్డను తల్లికి అప్పగించాలని ఆదేశించింది. ఐదు రోజుల పాటు తల్లి వద్ద.. రెండు రోజులు తండ్రి వద్ద చిన్నారిని ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది. శుక్రవారం సాయంత్రం పెద్ద కుమార్తెను తీసుకెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని సూచించింది. తదుపరి విచారణను జూన్‌4కు వాయిదా వేసింది.