కావాల‌నే బ్రిట‌న్ పౌర‌స‌త్వం తీసుకున్న వ్య‌క్తిని పార్ల‌మెంట్‌కు ఎంపిక చేసే అవ‌కాశం ఉంటుందా?

SMTV Desk 2019-05-02 15:41:24  rahul gandhi, congress president, wayanad, amethi

న్యూఢిల్లీ, మే 02: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీక‌రించింది. రాహుల్‌కు బ్రిట‌న్‌లో పౌర‌స‌త్వం ఉంద‌ని, అందుకే ఆయ‌న్ను ఎంపీగా పోటీ చేయకుండా ర‌ద్దు చేయాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. ఢిల్లీకి చెందిన జై భ‌గ‌వాన్ గోయ‌ల్‌, చంద‌ర్ ప్ర‌కాశ్ త్యాగీలు ఆ పిటిష‌న్ వేశారు.

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ క్షేమం కోసం పిటిష‌న్‌దారులు పోరాటం చేశార‌ని, వారి అభ్య‌ర్థ‌న‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ ఇవాళ తెలిపారు. గాంధీకి బ్రిటీష్ పౌర‌స‌త్వం ఉంద‌న్న అంశంపై ఎన్నిక‌ల సంఘానికి ఆదేశాలు జారీ చేయాల‌ని పిటిష‌న్‌లో సుప్రీంను కోరారు. కావాల‌నే బ్రిట‌న్ పౌర‌స‌త్వం తీసుకున్న వ్య‌క్తిని.. భార‌త పార్ల‌మెంట్‌కు ఎంపిక చేసే అవ‌కాశం ఉంటుందా లేదా అని ప్ర‌శ్నించారు. రాహుల్ ద్వంద్వ పౌర‌స‌త్వం ఉంద‌న్న అంశంపై ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

కాగా రాహుల్ గాంధీ రాబోయో లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నట్లు అందరికి తెలిసిందే. అయితే..రాహుల్ గాంధీ ఫ్యామిలీ తరతరాలుగా అమేథీ నుండి పోటీ చేస్తున్నారని..ఇప్పుడు ఆ స్థానంతో పాటు వయనాడ్‌లో కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు.