దేశ ఆర్థిక భవిష్యత్ ఎలా ఉండబోతుంది?

SMTV Desk 2017-08-22 14:17:23  Mastercard Index of Consumer Confidence, India, China, Asia, Financial Document Search, Regulatory Compliance, Foreign Exchange, Financial Data, Indices & Index Services

న్యూఢిల్లీ, ఆగస్ట్ 22: దేశ ఆర్థిక భవిష్యత్ పై సర్వే రూపొందించే మాస్టర్‌ కార్డు ఇండెక్స్‌ ఆఫ్‌ కన్స్యూమర్‌ కాన్ఫిడెన్స్ సంస్థ సోమవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక వివరాల ప్రకారం భారత్ పై వినియోగదారుల్లో నమ్మకం తగ్గు ముఖం పెట్టింది. గత ఏడాది జూలై-డిసెంబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం జనవరి-జూన్‌ మధ్య కాలంలో ఈ విషయంలో వినియోగదారుల్లో నమ్మకం బాగా దెబ్బతింది. ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలోని మొత్తం 18 దేశాల్లో 9,153 మందిని సర్వే చేసి ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. వీరందరినీ వచ్చే ఆరు నెలల్లో మీ దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఆదాయ అవకాశాలు, స్టాక్‌ మార్కెట్‌, జీవన విధానాల నాణ్యత ఎలా ఉంటాయో తెలపాలని అడిగారు. కాగా, 11 దేశాల వినియోగదారులు వారి దేశ ఆర్థిక భవిష్యత్‌పై స్థిరమైన అభిప్రాయం వ్యక్తం చేయగా, భారత్ విషయానికి వచ్చేసరికి గత జూలై-డిసెంబర్‌ నెలల్లో 95.3గా ఉన్న ఇండెక్స్‌ విలువ ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో తగ్గు ముఖం పట్టి 86కి పడిపోయింది. భారత కన్జుమర్‌ విశ్వాసం గతంలో ఎన్నడూ ఇంత భారీ స్థాయిలో క్షీణించలేదు. భారత్‌లో జీవన విధానం నాణ్యత, ఆర్థిక వ్యవస్థ రాబోవు ఆరు నెలల్లో అంత ఆశాజనకంగా ఉండక పోవచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశాని కంటే మెరుగైన స్థానంలో చైనా 88.2 పాయింట్లతో ముందుంది.