‘తాలా’ అనే పిలవండి!

SMTV Desk 2019-05-02 13:49:43  mahendra singh dhoni, msd, thala, dhoni, mahi, pipl 2019, chennai

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికి మూడు సార్లు ఐపిఎల్ టైటిల్ ఆ జట్టుకు అందించాడు. ఇక ధోనికి దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. వారిలో ధోనిని కొంత మంది మహీ, ఎంఎస్‌డి అని అభిమానులు, ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు పిలుచుకుంటారు. సిఎస్‌కె అభిమానులు ధోనీకి ‘తాలా’ అని పిలుస్తుంటారు. తాలా’ అంటే తమిళంలో లీడర్ అని అర్థం. సిఎస్‌కెకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడంతో ఆయన తమిళ అభిమానులు తాలా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. తన అభిమానులు పెట్టుకున్న పేర్లలో తాలా బాగా నచ్చిందని ధోనీ చెప్పాడు. ఇప్పటి నుంచి తనని తన పేరు పెట్టి పిలువకండని తాలా అని పలకండని అభిమానులకు సూచించారు.