కెనడా ప్రభుత్వంలో తెలుగు మంత్రులు

SMTV Desk 2019-05-02 12:52:34  Canada, Canada government, canada cabinet ministers indians, prasad panda, leela ahiroth, rajan sahne

కెనడా: కెనడా ప్రభుత్వంలో ముగ్గురు భారతీయులు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసాద్ పండా, లీలా అహీర్‌తో పాటు రాజన్ సాహ్నే కెనడా కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. ప్రసాద్ పండా స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి. కాల్గరి - ఎడ్జ్‌మెంట్ నియోజకవర్గం నుంచి ఆయన లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లాకు చెందిన లీలా అహీర్ ఎడ్‌మోంటన్ - చెస్టర్‌మేర్ నియోజకవర్గం నుంచి కెనడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సోషల్ సర్వీస్‌లో ముందుండే ఆమెకు సాంస్కృతిక, మహిళా సంక్షేమ శాఖ అప్పగించారు. రాజన్ సాహ్నే సైతం కెనడా ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. కేబినెట్‌లో కమ్యూనిటీ అండ్ సోషల్ సర్వీసెస్ శాఖకు ఆమెకు అప్పగించారు.