పర్సనల్ సెక్యురిటీని మనువాడిన థాయ్‌లాండ్ రాజు

SMTV Desk 2019-05-02 12:49:58  thailand, thailand king maha vaziralong corn married his personal security guard

థాయ్‌లాండ్: థాయ్‌లాండ్ రాజు మహా వజిరలోంగ్ కార్న్ తాజాగా తన పర్సనల్ సెక్యురిటీ గార్డ్ విభాగంలో పనిచేసే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన థాయ్ రాయల్ గెజిట్.. వారి పెళ్లి ఫొటోలను, వీడియోలను విడుదల చేసింది. దీంతో ఆ దేశ ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా గతంలో వజిరలోంగ్‌కు మూడు వివాహాలు జరగగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. ఆ ముగ్గురితోనూ ఆయన విడాకులు తీసుకున్నారు. మరోవైపు థాయ్ ఎయిర్‌వేస్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తోన్న సుతిదను వజిరలోంగ్ 2014లో తన బాడీగార్డుల్లో డిప్యూటీ కమాండెంట్‌గా నియమించుకున్నారు. ఓ విమానంలో సుతిదను చూసి మనసుపడ్డ వజిరలోంగ్.. ఇప్పుడు ఆమెను తనదాన్ని చేసుకున్నాడు.