మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలు

SMTV Desk 2019-05-02 12:41:12  newzealand open tournament, saina nehwal

ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ తన పేలవ ప్రదర్శనతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. సైనా మొదటి రౌండ్‌లోనే అనామక క్రీడాకారిణి చేతిలో ఓటమి పాలై నిరాశ పరిచింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ప్రపంచ 212వ ర్యాంక్ క్రీడాకారిణి వాంగ్ జియి చేతిలో సైనా అవమానకర రీతిలో పరాజయం చవిచూసింది. వాంగ్ అద్భుత ఆటతో ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో ఉన్న సైనాపై సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో వాంగ్ 2116, 2123, 214 తేడాతో సైనాను చిత్తు చేసింది. ప్రారంభం నుంచే వాంగ్ అద్భుత ఆటను కనబరిచింది. కళ్లు చెదిరే షాట్లతో సైనాను హడలెత్తించింది.