మళ్ళీ పడిపోయిన పసిడి విలువ

SMTV Desk 2019-05-02 12:35:46  Gold Rate, Silver rate, Bullion market

ముంభై: ఇండియన్ మార్కెట్లో గురువారం కూడా బంగారం ధర పడిపోయింది. బుధవారం పది గ్రాముల బంగారం ధర రూ.75 తగ్గుదలతో రూ.32,870కు క్షీణించింది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి చేరింది. కేజీ వెండి ధర రూ.25 పెరుగుదలతో రూ.38,525కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం సానుకూల ప్రభావం చూపింది. దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.75 తగ్గుదలతో రూ.32,870కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.75 తగ్గుదలతో రూ.32,700కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి రూ.25 పెరుగుదలతో రూ.38,525కు చేరితే.. .. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.149 క్షీణతతో రూ.37,073కు దొగిచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది.