అనసూయ అమాంతం పెంచేసింది ...

SMTV Desk 2019-05-02 12:23:33  Anasuya,

బుల్లితెర యాంకర్ గా బాగా పాపులర్ అయిన అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది. క్షణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ తన అదృష్టం పరిక్షించుకున్న అనసూయ ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన అందరిని మెప్పించింది. ఆ సినిమా నుండి అమ్మడికి ఇక వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

అనసూయ ప్రస్తుతం కథనం సినిమాలో నటిస్తుంది. సినిమాలో ఆమెదే లీడ్ రోల్ కావడం విశేషం. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ డైరక్షన్ లో సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందట అనసూయ. ఆ సినిమాలో నటించేందుకు అమ్మడు భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందట. సినిమాలో అనసూయ కూడా ఇంపార్టెంట్ రోల్ అని తెలిసి 25 లక్షల నుండి 30 లక్షల దాకా అడిగిందట.

యూత్ ఆడియెన్స్ లో అనసూయకు ఉన్న ఫాలోయింగ్ తెలుసుకుని ఆమె అడిగినంత ఇచ్చేందుకు రెడీ అయ్యారట. మొత్తానికి అనసూయ అటు యాంకర్ గా సత్తా చాటుతూనే సిల్వర్ స్క్రీన్ పై ఓ చిన్న పాటి హీరోయిన్ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది. మరి చిరు సినిమాలో ఆమె రోల్ ఎలా ఉంటుందో చూడాలి.