సైరా లేటెస్ట్ అప్ డేట్ వింటే షాక్

SMTV Desk 2019-05-02 12:21:11  Syeraa, Narasimha Reddy, Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు అప్పుడే క్రేజీ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. సైరా సినిమా 200 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది.

ఈ సినిమాకు అప్పుడే నైజాం ఏరియాకు గాను 25 కోట్ల డిస్ట్రిబ్యూషన్ ఆఫర్ ఇచ్చాడట సుధాకర్ రెడ్డి. దిల్ రాజు కన్నా ముందునుండే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న సుధాకర్ రెడ్డి ఈమధ్య సినిమా ప్రొడక్షన్ లో డిస్ట్రిబ్యూషన్ పై కొద్దిగా వెనుకపడ్డాడు. అయితే ఇక మీద అలా జరుగకుండా నైజాంతో పాటుగా మిగతా ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసేలా చూస్తున్నాడట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న సైరా సినిమా బిజినెస్ అదరగొట్టేలా ఉంది.