మధుమేహం కంట్రోల్లో ఉండాలంటే

SMTV Desk 2019-05-01 19:17:38  Diabeties,

మధుమేహానికి నేరేడుకీ వున్న శతృత్వం ఈ నాటిది కాదు -నేరేడు పేరు చెబితేనే మధుమేహవ్యాధికి దడ పట్టుకొంటుంది . అంత శక్తివంతంగా నిర్ధ్వంధ్వంగా నిర్మహమాటంగా నేరేడు మధుమేహవ్యాధి మీద పనిచేస్తుంది .

ఆయుర్వేద ఔషధాలలో జంబూవాసవం అనే మందు నేరేడు పండులోపలి గింజలతో తయారయేది . నేరేడు గింజల్ని సేకరించి ,ఎండించి ,మెత్తగా దంచి ,రోజూ ఒక చెంచా పొడి చొప్పున మూడు పూటలా తీసుకొంటే మధుమేహం ఎప్పుడు కంట్రోల్లో వుంటుంది . నేరేడు గింజల్ని మొలక గట్టి ఎండించిన మెంతుల్ని దోరగా నేతిలో వేయించి మెత్తగా దంచి తగినంత ఉప్పు కలిపి ఆ పొడిని రోజూ 1 చెంచా మోతాదులో అన్నంలో తినండి . మంచి ఉపయోగం కన్పిస్తుంది .మాములుగా మీరు వాడుకునే మందులతో పాటు అదనంగా ఈ ప్రయోగం చేయండి . క్రమంగా మీకు వాడుకొనే మందుల మోతాదు తగ్గించుకొనేలా షుగర్ కంట్రోల్లోకి త్వరగా వచ్చెందుకు ఈ నేరేడు ,మెంతులు వగైరా సహకరిస్తాయి .