శ్రీకాకుళంలో నాటు బాంబు పేలి ఏడుగురికి గాయాలు

SMTV Desk 2019-05-01 19:16:03  srikakulam, echherla mandal, yatapeta village bomblast

శ్రీకాకుళం: జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయితీ పరిధిలోని నాటు బాంబు పేలి ఏడుగురు గాయాలపాలయ్యారు. కుశాలపురం పంచాయితీ పరిధిలోని యాటపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు అద్దెకు దిగి నాటు బాంబులు తయారు చేస్తున్నారు. అడవి పందులను వేటాడేందుకు వారు నాటు బాంబులను వాడుతున్నారు. అవి ఒక్కసారిగా పేలి ఏడుగురు గాయపడ్డారు. వెంటనే వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడుకు ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది.