నాని సినిమా స్టోరీ ని కాదన్న సూపర్ స్టార్

SMTV Desk 2019-05-01 17:58:37  Mahesh Babu, Nani

ఒక హీరో కాదనుకున్న మూవీ మరో హీరో చేయడం సర్వసాధారణమే.. లేటెస్ట్ గా అలాంటి ఓ క్రేజీ థింగ్ జరిగింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ చేయాల్సిన ఓ సినిమాను నాచురల్ స్టార్ నాని చేస్తున్నాడు. జెర్సీ తర్వాత నాని చేస్తున్న గ్యాంగ్ లీడర్ కథ ముందు విక్రం కుమార్ మహేష్ కోసం రాసుకున్నాడట. అయితే మహేష్ కు ఎందుకో ఆ స్టోరీ నచ్చక వద్దనేశాడట. ఇంతకుముందు కూడా మహేష్ కోసం 24 కథ కూడా చెప్పాడు విక్రం అయితే అది కూడా మహేష్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మిస్ చేసుకున్నాడు.

నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు మెగా ఫ్యాన్స్ నుండి టైటిల్ ఫైట్ కూడా జరిగింది. అయితే ఎలాగోలా ఆ గొడవ సర్ధుమనిగింది. మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నాకెవ్వరు సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమాలో మహేష్ తో పాటుగా సీనియర్ స్టార్స్ విజయశాంతి, రమ్యకృష్ణ, జగపతి బాబు నటిస్తారని తెలుస్తుంది.