అఖిల్ చిత్రం టైటిల్ ఖరారు

SMTV Desk 2017-08-22 11:28:18  akhil, akhil movie, nirnayam, hello guru song, vikram kumar, nagarjuna, hello, nagarjuna

హైదరాబాద్, ఆగస్ట్ 22: విక్రం కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న రెండో చిత్రం టైటిల్ గురించి ఇటీవల నాగార్జున తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో రెండు పాటలు షేర్ చేసి ఆ పాటలలోనే ఈ చిత్ర టైటిల్ ఉందని క్లూ ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ‘హలో..’ పేరుతోనే సినిమా పేరు మొదలయ్యే అవకాశాలున్నాయని అనుకున్నారు అక్కినేని అభిమానులు. ప్రేక్షకులు ఉహించినట్లుగానే ఈ చిత్రానికి ‘హలో’ అనే టైటిల్ ని పిక్స్ చేసినట్లుగా తన ట్విటర్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశారు నాగార్జున. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రాలకి రెండు అక్షరాల పేర్లే ఎక్కువగా ఉంటాయని, కాగా ఈ చిత్రానికి కూడా అదే సెంటిమెంట్‌ని ఫాలో అయినట్లుగా తెలుస్తోంది. కల్యాణి ప్రియదర్శన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాని డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా సమాచారం. ఈ చిత్రంతో అయిన అఖిల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.