స్పెసల్ ఫీచర్స్ తో వస్తున్న వివో జడ్3ఎక్స్

SMTV Desk 2019-05-01 15:22:38  vivo smartphone, vivo, vivo z3x

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. వివో జడ్3ఎక్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ వివో జడ్1 ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అని కేంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, నాచ్ డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలున్నాయి. గేమ్ టర్బో, సిస్టమ్ టర్బో వంటి ప్రత్యేకతలున్నాయి. వివో జడ్3ఎక్స్ ఫోన్‌లో కెమెరా విషయానికి వస్తే.. డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. ఇక ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ధర రూ.12,400. మే 8 నుంచి ఈ ఫోన్లు చైనా మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్, 4జీ ఎల్‌‌టీఈ, 3,260 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి.